![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -654 లో... శ్రీధర్ దగ్గరికి వసంత్ వస్తాడు. నువ్వు ఎక్కడికో క్యాంపుకి వెళ్ళావ్ అన్నావ్.. వెళ్లలేదా అని శ్రీధర్ అడుగుతాడు. లేదు మావయ్య స్వప్నకి సర్ ప్రైజ్ ఇద్దామని వచ్చానని అంటాడు. స్వప్నని నేను పిలుస్తానని పిలుస్తాడు.
ఎల్లుండి మంచి రోజు అంట ఎంగేజ్మెంట్ చేసుకోమని పంతులు గారు చెప్పారని వసంత్ చెప్తాడు. ఏంటి నువ్వు.. మేం ఆలోచించుకోవాలి కదా అని కావేరి అంటుంది. అవును స్వప్న కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా అని కాశీ అంటాడు. నేను తీసుకున్నానని స్వప్న అంటుంది. నాకు ఏం ప్రాబ్లెమ్ లేదని స్వప్న అనగానే బ్రో నీకేమైనా ప్రాబ్లమా అని కాశీని వసంత్ అడుగుతాడు. నీకేం ఉంటుందిలే స్వప్నకే ఏం ప్రాబ్లమ్ లేదు.. నాకు ఏం ప్రాబ్లమ్ లేదని వసంత్ అంటాడు. మీరు అయినా చెప్పండి అని శ్రీధర్ తో కావేరి అంటుంది. నా కూతురు ఇష్టమే నా ఇష్టం అని శ్రీధర్ అంటాడు.
ఆ తర్వాత అందరు వెళ్ళాక నువ్వు ఏం బాధపడకు అల్లుడు.. నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని తనకి బుద్దివచ్చేలా చెయ్యమని కావేరి అంటుంది. తను నన్ను వద్దని అనుకుంటుంది.. నేను కాదని కాశీ అంటాడు.
ఆ తర్వాత దాస్ డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఏంటి నాన్న అని మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్న పనులకి ఆ బుల్లెట్ ఏదో నాకు తగిలి ఉంటే బాగుండేదని జ్యోత్స్న అంటుంది. ఎప్పటిలాగే దాస్ ని తిట్టి పంపిస్తుంది జ్యోత్స్న.
ఆ తర్వాత కార్తీక్ కి దీప షర్ట్ చేంజ్ చేస్తుంది. అప్పుడే వైరా ఫోన్ చేస్తాడు. ఒరేయ్ రెండుసార్లు నన్ను మోసం చేసావ్ రా అని వైరా అనగానే పోలీసులు వస్తారు జాగ్రత్త అని కార్తీక్ అంటాడు. నీ మరదలు కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది.. ఎందుకు అంటే ఇదంతా ఒక డ్రామా.. నీ మరదలు అంటే నాకు కోపమే కానీ డబ్బులు ఎక్కువ అడుగు, నాకు అందులో వాటా కావాలి.. ఎలా మాట్లాడాలి.. ఎంత అడగాలని.. అంతా నీ మరదలు ప్లాన్ అని వైరా అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. నా వల్ల మీకు డేంజర్ కాదురా నీ మరదలు వల్లే డేంజర్ అని వైరా చెప్తాడు.
చూసావా బావ అది మారదని దీప అంటుంది. ఇక క్షమించేది లేదు ఇలా చేసుకుంటూ పోతే ఇంకా ఎక్కువ చేస్తుంది. బుద్ధి వచ్చేలా చెయ్యాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పారిజాతం కార్తీక్ తో కలిసి చేసిన పనికి రివార్డ్ గా తనకి యాభై వేలు ఇస్తాడు శివన్నారాయణ. దాంతో పారిజాతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |